
చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.
నంద్యాల (AIMA MEDIA): పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన "మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) – బడి వైపు ఒక అడుగు" కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ "ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని . విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, పాఠశాల మరియు ఇంటి వద్ద పర్యవేక్షణ అత్యవసరం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, క్రమశిక్షణపై రోజువారీ శ్రద్ధ చూపాలని.ఉపాధ్యాయులు బోధనలో మరింత నాణ్యతను పెంచలన్నారు . ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఉత్సవ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషకరం," అని అన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ కమిటీ, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితేనే, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయి అన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపించిన విద్యార్థినీ విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు . అనంతరం పాఠశాల యాజమాన్యం మంత్రి ఫరూక్ ని ఘనంగా సన్మానించారు.సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఫరూక్ పాఠశాల ఆవరణలోనే విద్యార్థులతో కలిసి కూర్చుని, ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్స్) రుచిని, నాణ్యతను పరిశీలిస్తూ వారితో కలసి భోజనం చేశారు. మంత్రి ఫరూక్ భోజనం చేస్తూ, విద్యార్థులతో వారి చదువు, క్రీడలు, పాఠశాల సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉర్దూ డిఐ అస్ముద్దీన్ , ఎంపీడీవో సుగుణ శ్రీ , నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , భూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , బాల ముని మరియు ఎస్ఎంసి చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు, మరియు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.