logo

డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): అభివృద్ధి శాఖలను డివిజనల్ స్థాయిలో తీసుకొచ్చి ప్రజలకు త్వరితగతిన సేవలందించడమే ప్రధానంగా డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని రైతు నగర్ లో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అభివృద్ధి శాఖలను డివిజనల్ స్థాయిలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పరిపాలనా పరిధిలోకి తీసుకురావడం వలన సేవల అందుబాటు పెరగడమే కాకుండా గ్రామీణాభివృద్ధికి వేగం చేరుతుందన్నారు. ప్రజలకు త్వరితగతిన సేవలు, మెరుగైన పర్యవేక్షణ, పారదర్శకత పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యాలయం ద్వారా మిషన్ విభాగాల మధ్య సమన్వయం బలోపేతం కావడంతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా అమలు కావచ్చని తెలిపారు.నంద్యాల పరిషత్ ప్రెసిడెంట్ శెట్టి ప్రభాకర్,ప్రాజెక్ట్ డైరెక్టర్ (డ్వా మ),జిల్లా పంచాయతీ అధికారి,నంద్యాల డివిజన్ పరిధిలోని అందరూ ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు , డి ఎల్ పి ఓ ,నంద్యాల తహసిల్దారు (రూరల్) , నంద్యాల తహసీల్దారు (అర్బన్),డివిజనల్ స్టాఫ్,ఎంపీపీ ఆఫీసు నంద్యాల వారి సిబ్బంది, ఎంపీడీవో ఎస్. సుగుణ శ్రీ పాల్గొన్నారు.

0
608 views