
తెలుగు గంగా చివరిఆయకట్టుకు ఏప్రిల్ చివరి వరకు సాగునీరు ఇవ్వండి.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం..
ఆళ్లగడ్డ చివరి భూముల వరకు వరి పంటకు సాగునీరు ఇవ్వలేము కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోమని మంగళవారం నాడు కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రులు, ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ కలసి తెలుగు గంగా ఆయకట్టు కింద వరి పంట వేయవద్దనీ చెప్పడం చాలా అన్యాయం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి .రామచంద్రుడు రుద్రవరం మండలంలో జరిగిన సమావేశంలో అన్నారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే, మార్చి 31 వరకు సాగునీరు అందిస్తాం అనడం జిల్లా రైతాంగాన్ని మోసం చేయడమేనని అన్నారు. ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వల్ల మొక్కజొన్న, వరి,మినుము, ఉల్లి, మిరప పంటల దిగుబడి సగభాగం తగ్గిపోయిందని, ఉన్న వాటిని అమ్ముకుందామంటే మద్దతు ధరలు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయక తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కనీసం ఖరీఫ్ సీజన్లోనైనా వరి పంట సాగు చేసుకోని అప్పులు తీర్చుకోవచ్చు అని ఆశ పడివరి నారుమల్లు పోస్తున్నారు. వరి పండించే రైతుల్ని మోసం చేసే విధంగా ఉన్న సలహా మండలి తీర్మానాన్ని తెలుగు గంగ ఆయకట్టు రైతులందరూ వ్యతిరేకించాలని ఏప్రిల్ చివరి వరకు, వరి పంట పూర్తయ్యే వరకు సాగునీరు ఇవ్వాలని, ఆళ్లగడ్డ నియోజకవర్గం ఆయకట్టు భూములకు నీరందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతాంగం ఆందోళన చేస్తారని అందుకు ప్రభుత్వమేబాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేశారు. సకాలంలో విత్తనాలు ఇవ్వలేరు. సరిపడా ఎరువులు ఇవ్వరు. అంటే నష్టపరిహారం ఇవ్వరు. పంటల బీమా వర్తింప చేయరు. పండించుకున్న పంటకు మద్దతు ధర అమలు చేయరు. చివరకు పకృతి కనికరించి సాగు నీటిప్రాజెక్టులు నిండా ఉన్న కూడా పంటలు పూర్తయ్యే వరకు సాగునీరు ఇస్తామని చెప్పలేరు. ఎలా జిల్లా రైతాంగం బతకాలి. ప్రచారంలో రైతు ప్రభుత్వం. ఆచరణలో రైతుల నడ్డి విరిచే ప్రభుత్వం. రైతుల పట్ల కనికరం లేని పాలకులారా సాగు నీటి విడుదల విషయంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం రైతాంగానికి , వరి పండించే రైతాంగానికిఅన్యాయం చేయవద్దు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నరసయ్య, శ్రీనివాసులు, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు