logo

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... భీమిలిలో 'కోటి సంతకాలు' ఉద్యమం: పాల్గొన్న చిన్న శ్రీను కుమార్తె సిరమ్మ

ఈ రోజు భీమిలి నియోజకవర్గం, భీమిలి 4వార్డు , మంగమారి పేటలో డి. కొండబాబు మరియు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గం పాల్ రమణ ఆధ్వర్యంలో జరుగు కోటి సంతకాలు కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* *తన తండ్రి ఆదేశాలు మేరకు* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య , వైద్యం ప్రజలకనీస హక్కు అని , ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోందని అన్నారు. మెడికల్ కాలేజీలకు వ్యతి రేకంగా ఈ కోటి సంతకాలు కార్యక్రమం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, కార్య కర్తలు,చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

5
891 views