logo

స్కూల్ అసిస్టెంట్, ఎస్.జి.టి పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల మండలంలో ఉన్న మునిసిపల్,మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరమునకు గాను (8-12-25 నుండి 07-05-26) తాత్కాలిక ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్, ఎస్టి పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఇఒ బ్రహ్మం నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.12,500, ఎసిటి పోస్ట్ కు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తారని, దరఖాస్తులకు డిసెంబర్ 5వ తేది సాయంత్రం ఐదు గంటల లోపు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె పొట్టి శ్రీరాములు మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు డిగ్రీ తో పాటు బీఈడీ మరియు ఎస్ జి టి పోస్ట్ కు ఇంటర్మీడియట్ తో పాటు టిటిసి విద్యార్హత కలిగి ఉండాలని ఎంఈఓ అబ్రహం తెలియజేశారు.

0
423 views