జగిత్యాల జ్యువలరీ షాప్ లో రింగ్ మార్పిడి దొంగతనం… బుర్కాలో వచ్చిన దొంగలు
జర్నలిస్ట్ : మహేష్ మహేష్
జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద గల ఓ జువెలరీ షాప్‌లో రింగ్ మార్పిడి చోరీ జరిగింది, బుర్కా వేసుకున్న మహిళ ఓ వ్యక్తితో కలిసి షాప్‌కు వచ్చి, ఖరీదైన గోల్డ్ రింగ్‌లు చూపించమని కోరారు. అమ్మకందారుడు చూపించిన రింగ్‌ను పరిశీలిస్తుండగా, చాకచక్యంగా తమతో తెచ్చుకున్న డూప్లికేట్ రింగ్ పెట్టి, అసలు గోల్డ్ రింగ్‌ను జేబులో వేసుకుని పరారయ్యారు.
దొంగలు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే మోసం జరిగినట్లు గ్రహించిన సిబ్బంది వెంటనే యజమానికి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు, షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుల గుర్తింపుకు ప్రయత్నిస్తున్నారు