logo

రైతు రాజు కాదు మహారాజు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ రైతే రాజు

రైతే రాజు
రైతు పడని కష్టం లేదు..
రైతు చూడని నష్టం లేదు..
రైతు చూడని చావు లేదు..
మనకి అన్నం గురించి ఎదురుచూసే రోజు వస్తే తప్ప..
రైతు విలువ తెలియదు..

ఉద్యోగికి సెలవొచ్చినా..
కంపెనీలకి తాళంపడినా..
ప్రభుత్వాలే స్థంభించినా
ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే “రైతన్న

మన నాయకులలో అనేకమందికి రైతుకుటుంబ నైపథ్యం ఉంటుంది.

రైతులలో పెద్ద భూస్వాములూ ఉన్నారు , ఆతి పేద రైతు కూలీలు ఉన్నారు.

వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది
అగ్రకల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్పూర్తి రైతన్న.

వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు
నిజమైన సంపద, నైతిక విలువలు ఆనందాలు సాగుతోనే సిద్ధిస్తాయి

రైతు మట్టిలో బ్రతుకుతాడు.. ప్రజల ఆకలిని తీర్చడానికి బ్రతుకుతాడు !

ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే..
కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు,బంగారం పండిస్తాడు

రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ
రైతెప్పుడూ రాజే..!!

ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్తి రైతు.

రక్తంతో నేలను దున్ని
స్వేదంతో సేద్యం చేసి
తన బతుకును
అన్నం మెతుకుగా మార్చే రైతన్నకు వందనాలు.

వ్యవసాయం
ప్రతిక్షణం ఎగిసిపడే కెరటం
ప్రపంచానికి సాయం చేయడానికి
ప్రతిసారి పడి లేస్తుంది
అందుకే అది అమృతం..
అందరికీ రైతన్న ఆదర్శం

రైతు గానీ లాక్ డైన్ చేశాడంటే
కరోనా కంటే ప్రమాదకరం

దేశానికి ఆహారాన్ని అందిస్తూ..
అతడు చేసే కృషి వెలకట్టలేనిది!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకై నిలిచే
అతడిని మనం సదా ప్రశంసించవలసిందే.
🌾🌾 "అందుకే రైతే రాజు"🌾🌾
రైతన్నకు జోహార్లు 🙏

0
377 views