logo

* ప్రజలకు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద దేశవ్యాప్త నిరసన జరిగింది*


మోడీ అనుసరిస్తున్న ప్తజా, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు, పారిశ్రామిక పెట్టుబడిదారులకి కార్మికులను, రైతులను కట్టుబానిసలుగా చేసెందుకు మోడీ ప్రభుత్వం తీసుకోచ్చిన 4 లేబర్ కోడ్ లను, 3 రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాపిత నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా బుధవారం ఉదయం విజయనగరం జిల్లా కలెక్టరెట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి, సీఐటీయూ, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఏఐసీసీటీయు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఎఐకెఎస్ ( సిపిఐ అనుబంధం ), ఎ. పి రైతు సంఘం ( సీపీఎమ్ అనుబంధం ), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, బికెఎంయు ( సిపిఐ అనుబంధం ) రైతు కూలి సంఘం, రైతు సంక్షేమ సంఘం మొదలైన సంఘాల నేతలు మరియు కార్మికులు, రైతులు పాల్గొన్నారు.

0
0 views