logo

హిందూ సమ్మేళనం పురస్కరించుకొని సామూహిక హారతి

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెలం కాయల పాలెం గ్రామంలో డిసెంబర్ ఒకటో తారీఖున సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోటవురట్ల చత్రపతి శివాజీ హిందూ సేన అధ్యక్షులు నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో హిందువులందరూ ఏకం కావాలని, అన్యమతస్తులు మన పై జరిపే దాడులను ప్రతి ఒక్కరూ గమనించి హిందువుల ఐక్యత గురించి పోరాడాలని తెలిపారు. అలాగే డిసెంబర్ ఒకటవ తారీఖున కోట ఉరట్లలో జరిగే హిందూ మహాసమ్మేళనానికి ప్రతి ఒక్కరూ పాల్గొని హిందువుల ఐక్యతను నిరూపించుకోవాలని, కోరారు. కార్యక్రమంలో భాగంగా గ్రామములోని స్త్రీమూర్తులందరూ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ హారతినిచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలోని యువకులు, పెద్దలు, స్త్రీమూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

14
1546 views