logo

ఎస్ ఎఫ్ ఐ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి





భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎల్ బి జి భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి. రాము, సి హెచ్. వెంకటేష్ మాట్లాడారు. నవంబర్ 27, 28 తేదీలలో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో విజయనగరం పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రారంభ సూచికగా 27వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం బహిరంగ సభ గురజాడ కళాభారతం నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ బహిరంగ సభకు ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి ఐసి ఘోష్ మరియు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ హాజరు కావడం జరుగుతుంది. మరుసటి రోజు జరుగు జిల్లా మహాసభలో జిల్లాలో పేరుకుపోయి ఉన్న విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకూ జరిగిన పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేటికీ సొంత భవనం లేకపోవడం. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్ అమ్మాయిలకి ఒకటి సరిపోక పోవడం. ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెరగకపోవడం వలన విద్యార్థుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. (జె ఎన్ టి యు జి వి) కి నిధులు కేటాయించడంలోనూ సిబ్బంది నియామకంలోనూ ప్రభుత్వం నీలి నడకలు వేస్తుంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనాలు పూర్తి కాలేదు. యువగలం లో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ 77 రద్దు అమలు కాలేదు. పైగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ లు బకాయి ఉంచడం వలన విద్యార్థులు చదువులుపై భారం పడుతుంది. వీటితోపాటు మరిన్ని విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాడేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతున్న ఈ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని విద్యార్థుల్లోకానికి మేధావులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సి హెచ్. వెంకటేష్, జిల్లా అధ్యక్షులు డి. రాము, జిల్లాగర్ల్స్ కన్వీనర్ ఆర్. శిరీష, జిల్లా సహాయ కార్యదర్శి ఎ. చిన్నబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జె. రవికుమార్, కె. జగదీష్, ఎస్. సోమేష్ జిల్లా కమిటీ సభ్యులు రమణ పాల్గొన్నారు.

7
780 views