logo

వీరనారీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి - నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి.

వీరనారీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

- నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి.

క్రౌన్ హ్యూమన్ రైట్స్ నంద్యాల నవంబర్ 20;

ప్రతి విద్యార్థిని వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు.ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో శ్రీ రాజరాజేశ్వరి స్కూల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నిర్వహించారు.
ముఖ్య అతిథిగాపాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఇంటి నుండి దేశం వరకు అభివృద్ధి చెందాలన్నా క్రమశిక్షణతో ఉండాలని, అది ఒక మహిళ వలన సాధ్యం అవుతుందని, వీరనారి పరాక్రవంతురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని జరుపుకోవడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల రాజరాజేశ్వరి స్కూల్ కరెస్పాండంట్ రామేశ్వరరావు, ఆంధ్ర విద్యార్థి సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తురకా ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి నాగరాజు, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, అపుస్మా జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, అనురాధ, AVS పాణ్యం నియోజకవర్గం కన్వీనర్ నాగ శంకర్, నగర కార్యదర్శి సుమంత్, నంద్యాల నియోజకవర్గం కన్వీనర్ హేమంత్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. దేశ భక్తి ఉట్టి పడేలా నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బహుమతులు అందించారు.

0
99 views