
నందలూరు లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ ఇవ్వండి
నందలూరు లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ ఇవ్వండి
క్రౌన్ హ్యూమన్ రైట్స్
నందలూరు నవంబర్ 20;
నందలూరు రైల్వే కేంద్రంలో వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ ఇప్పించండి అని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ గుప్తాకు విన్నవించారు. గురువారం రైల్వే డిఆర్ఎమ్ నందలూరు రైల్వే కేంద్రంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ ను తనిఖీ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆయనను కలిసి తిరుపతి నుండి కాచిగూడ కు వెళ్లే వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నందలూరులో ఆపాలని తద్వారా ఈ ప్రాంత ప్రజలకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్యంగాఇందులో భాగంగా ఆర్యవైశ్య అధ్యక్షులు అధ్యక్షులు నరసింహస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఎం ను శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలపై పరిశీలిస్తామని డి ఆర్ ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.