logo

ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ అందించాలని కోరుతూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ నెల1వ తేదీన నంద్యాలలో చేపట్టే మహా పాదయాత్రను జయప్రదం చేయండి-MIV



మడకశిర పట్టణంలో ముస్లిం ఐక్యవేదిక విద్యార్థి విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వసీమ్ బేగ్ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వసీమ్ బేగ్ మాట్లాడుతు ముస్లిం సమాజం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, రాజకీయ రంగంలో మాత్రం తీవ్రమైన వెనుకబాటుతనానికి గురవుతోంది. గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ వరకు ప్రజా ప్రతినిధుల్లో ముస్లింల వాటా అత్యల్పంగా ఉండటం విచారకరం. ఈ పరిస్థితులలో ముస్లింల కోరికలు, సమస్యలు, హక్కులు శాసనసభలలో ప్రతిబింబించాలంటే రాజకీయ రిజర్వేషన్ అనేది అత్యవసరమని ముస్లిం ఐక్యవేదిక స్పష్టం చేస్తోంది సచర్ కమిటీ, రంగా నాథన్ మిశ్రా కమిటీలు ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా వెనుకబాటుతనాన్ని స్పష్టంగా నిరూపించాయి. ఈ నివేదికలు ఏ ప్రభుత్వమైనా వెంటనే అమలు చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత అయినప్పటికీ సంవత్సరాలుగా ఈ నివేదికలు పట్టించుకోకపోవడం ముస్లింలలో తీవ్ర ఆవేదనకు దారితీస్తోంది ఈ నేపథ్యంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల‌లో చేపట్టే మహా పాదయాత్ర ముస్లిం సమాజ హక్కుల పరిరక్షణ కోసం చారిత్రాత్మక పోరాటానికి నాంది కానుంది. ఈ పాదయాత్ర ద్వారా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేయడం సచర్ కమిటీ, మిశ్రా కమిటీ సిఫారసులను అమల్లోకి తేవాలని డిమాండ్ చేయడం ముస్లిం యువతలో అవగాహన పెంపొందించడం అన్ని వర్గాల ప్రజల్లో ఐక్యత, న్యాయం, సమానత్వం సందేశాన్ని విస్తరించడం
అన్న లక్ష్యాలను ముందుంచుతున్నామని ముస్లిం ఐక్యవేదిక విద్యార్థి విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వసీమ్ బేగ్ తెలిపారు ముస్లింలపై వివక్ష, అన్యాయం తగ్గాలంటే రాజకీయంగా శక్తివంతం కావాలి. పథకాలు, నిధులు, సంక్షేమ కార్యక్రమాలు నిజంగా ముస్లిం వర్గాలకు చేరాలంటే మన వర్గానికే చెందిన ప్రజా ప్రతినిధులు అవసరం. అందువల్ల రిజర్వేషన్ కోసం జరగబోయే ఈ పాదయాత్రలో ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి ముస్లిం సంఘం, మదర్‌సాల విద్యార్థులు, గైర్హముస్లిం మద్దతుదారులు అందరూ భాగస్వామ్యం కావాలని వసీమ్ బేగ్ పిలుపునిచ్చారు ముస్లిం ఐక్యవేదిక చేపడుతున్న ఈ పాదయాత్ర కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే కాదు ముస్లిం హక్కుల కోసం ఒక ప్రజా ఉద్యమం, భవిష్యత్ తరాల కోసం ఒక పునాది, సమాజం కోసం ఒక స్వరపతాకం ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని వసీమ్ బేగ్ విజ్ఞప్తి చేశారు.

0
607 views