logo

జగ్గయ్యపేట RTC డిపో N.M.U.A యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పణ

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నవంబర్ 20: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో నుంచి నడిచే కీలక దూరప్రాంత బస్సు సర్వీసులు—సాయంత్రం 5:00కి కాకినాడ, రాత్రి 9:00కి శ్రీశైలం, ఉదయం 6:20కి తిరుపతి, సాయంత్రం 6:00కి తిరుపతి సూపర్ లగ్జరీ—తాజాగా రద్దు కావడంతో, వాటిని పునరుద్ధరిం చాల్సిన అవసరాన్ని N.M.U.A యూనియన్ ప్రతినిధులు స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కు వివరించారు. అంతేకాక, స్త్రీ శక్తి పథకం కారణంగా ఇంటర్ సర్వీసులుగా నడిచే జగ్గయ్యపేట – కోదాడ, జగ్గయ్యపేట–వైరా, జగ్గయ్యపేట–చింతిర్యాల రూట్లలో ప్రయాణికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతినిధులు వివరించారు. అలాగే, సిబ్బంది పై జరుగుతున్న బౌతిక దాడుల పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం అందుకున్న శాసన సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సమస్యలను శ్రద్ధగా విని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. NMUA ప్రతినిధులు ఎమ్మెల్యే స్పందనపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు గంటా భాస్కర రావు, చైర్మన్ వడ్లమూడి రాంబాబు, సెక్రటరీ ఐ.నాగేశ్వర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0
77 views