logo

నంద్యాల క్రిటికల్ కేర్ వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరం.

గడివేముల (AIMA MEDIA): నంద్యాల జిల్లా గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో నంద్యాల క్రిటికల్ గేర్ సెంటర్ వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ల బృందం తెలియజేశారు. 23 వ తారీకు ఆదివారం రోజున 10 గంటలకు డాక్టర్స్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు. ప్రముఖ డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపాడు గ్రామంలో కీళ్లు మరియు ఎముకల వైద్యం ల చే పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు సప్లై చేస్తాము అని తిరుపాడు గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడే నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలిఅన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, వృద్ధులు ఇలాంటివి సద్వినియోగం చేసుకోంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నంద్యాల క్రిటికల్ కేర్ సెంటర్ వారు ఈ ఉచిత వైద్య శిబిరం తిరుపాడు గ్రామంలో నిర్వహించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వల్ల వైద్య బృందం వైద్యానికి పెద్దపీట వేశారు.

0
99 views