
అర్బన్ నక్సల్స్ వల్లే ఎన్‌కౌంటర్లు !
జర్నలిస్టు : మాకోటి మహేష్
కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది ఇప్పుడు అడవుల్లో ఉండి ఏదో చేస్తామని అనుకుంటే ప్రాణాలు పోవడం తప్ప ఇంకేమీ ఉండదు.. జనారణ్యంలోకి వచ్చేయండి.. అని ఇటీవల లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల పిలుపునిస్తున్నారు. ఆయన తన ఫోన్ నెంబర్ కూడా ప్రకటించారు. సహచరులు లొంగిపోవాలనుకుంటే సంప్రదించాలని అనుకుంటున్నారు. సహచరుల ప్రాణాలు కాపాడాలని ఆయన తాపత్రయం. కానీ కొంత మంది ప్రశాంతంగా .. నగర్ జీవనంలో అర్బన్ నక్సల్స్ మాత్రం .. తుపాకీ తలవొంచదు అని రెచ్చగొడుతూనే ఉన్నారు.
అర్బన్ నక్సల్స్ విలాసవంతమైన జీవనం
ఈ నక్సలైట్లు అంతా అడవుల్లో తినీ. తినక చెట్లూ పుట్టల మధ్య జీవనం సాగిస్తూంటారు. ఎప్పటికప్పుడు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నామని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారందిరికి అర్బన్ నక్సల్స్ గాలి కొడుతూ ఉంటారు. ఇంకేముంది పీడల వర్గాలను కాపాడేస్తున్నాం.. పదండి ముందుకు..పదండి ముందుకు అని తోస్తూ ఉంటారు. వారు రెచ్చగొట్టే ధోరణి భిన్నంగా ఉంటుంది. తాము అగ్రకులాలమే అయినా అన్నీ వదిలేశారని.. మీ కోసమే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ అర్బన్ నక్సల్స్ ది విలాసవంతమైన జీవితం.
వీరిని నమ్మి నట్టేట మునుగుతున్న మావోయిస్టులు
మావోయిస్టులు వీరిని నమ్మి ప్రాణాలు కోల్పోతున్నారు. బయట పరిస్థితులు అర్థం చేసుకోలేక.. సిద్ధాంతం పేరుతో ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. ఎన్ కౌంటర్లు అయిపోతున్నారు. హిడ్మా ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన.. మావోయిస్టు పార్టీకి ఆశాకిరణం అని ఆశలు రేపి.. లొంగిపోకుండా.. మరో ప్రభాకరన్ అవుతారని మోటివేట్ చేశారని అర్థం అవుతుంది.కానీ ఆయన ఎన్ కౌంటర్ అయ్యారు. వృద్ధులైన ఇతర మావోయిస్టు నేతలు కూడా లొంగిపోకపోతే అదే జరుగుతుంది.
అర్బన్ నక్సల్స్ నిజాలెందుకు చెప్పరు ?
ప్రపంచం మారిపోయిందని .. ఇప్పుడు దాక్కోని ఉద్యమాలు చేయలేమని మల్లోజుల వేణుగోపాల్ చెబుతున్నారు. ఈ నిజాన్ని అడవుల నుంచి వచ్చిన ఆయన కనిపెట్టారు. కానీ అర్బన్ నక్సల్స్ ఈ నిజాన్ని నక్సలైట్లకు చెప్పడంలేదు. లొంగిపోతే ప్రాణాలు నిలబడతాయనే సమాచారం ఇవ్వడం లేదు. అలాంటి చానల్స్ ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా ఎంతో మంది చనిపోతున్నారు. దీనికి కారణం.. ఆ అర్బన్ నక్సల్సే.