logo

ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..!!* (ఏకంగా జిహెచ్ఎంసి పార్క్ ని రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసిన సబ్ రిజిస్టార్)

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **నవంబర్ 20**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


*ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..!!*

అవినీతి, అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. రిజిస్ట్రార్లు, ఇతర అధికారులపై అవినీతి ఫిర్యాదులు చూసి, శాఖను భ్రష్టు పట్టిస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఐజీ(రిజిస్ట్రేషన్)..

హైదరాబాద్ - వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కడంతో, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన సీనియర్ అసిస్టెంట్ శివశంకర్..

బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే, సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కును ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సదరు అధికారి..

స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకుని, శివశంకర్‌పై వేటు వేసిన ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు..

ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేసిన సరూర్‌నగర్‌ సబ్ రిజిస్ట్రార్ శ్రీలత..

దీంతో బాధితుడి పిటిషన్ పట్ల విచారణ జరిపి, సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం..

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు, అక్రమ దందాలు, లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారుల జాబితా ఎక్కువ అవుతున్నా, సంబంధిత మంత్రి నుండి ఎలాంటి చర్యలు లేవని ఆరోపిస్తున్న బాధితులు..

తీవ్ర విమర్శల మధ్య ఉన్నతాధికారులతో సమావేశమై, ఇక నుండి చిన్న ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు..!!

224
9765 views