logo

గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం

జర్నలిస్ట్ : మాకోటి మహేష్
మా పిల్లలు ఎక్కడా అని అడిగితే జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నాము అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన

వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నుండి అదృశ్యమైన హర్షవర్ధన్(9వ తరగతి), వినయ్(8వ తరగతి) అనే ఇద్దరు విద్యార్థులు

తమ పిల్లలు కనిపించడంలేదని పాఠశాల ముందు కంటతడి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు

అదృశ్యమైన తమ పిల్లల గురించి అడిగితే జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నామని, పాఠశాల లోపలికి అనుమతి ఇవ్వడంలేదని కుటుంబసభ్యుల ఆరోపణ

అధికారులు వెంటనే స్పందించి, తమ పిల్లల ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు

0
0 views