
కాంట్రాక్ట్ వర్కర్స్ త్రిప్ట్ సొసైటీ సభ్యులు మరణించిన యొక్క కుటుంబాలకు ఆర్థిక సహాయం త్రీప్టు పాలకవర్గం
విశాఖపట్నం(ఉక్కునగరం )
స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులగా పనిచేస్తూ త్రిఫ్ట్ సొసైటీ సభ్యత్వం కలిగి ఉన్న ఈ మధ్యకాలం లో మరణించిన సభ్యుల వారు కుటుంబానికి ఒక్కొక్కరు కి లక్ష రూపాయలు ఆర్థిక సాయం.వర్కర్ చింతల అప్పలనాయుడు(CO&CCP CSP),ముల్లు గౌరీ శంకర్(SBM ELECTRICAL)కర్రీ అప్పలరాజు(SP2 MMDP)
ఒక్కొక్క కుటుంబానికి రూ.100000 (లక్ష) చోప్పున కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CITUప్రధాన కార్యదర్శి నమ్మి రమణ చేతుల మీదగా ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా నమ్మి రవణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు త్రిఫ్ట్ సొసైటీ అనేక విధాలుగా సభ్యులకు ఆర్థికంగా అతి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నారు.చేదోడు వాదోడుగా సహకారం త్రీపుట్ పాలకవర్గం నిలుస్తుందని సుమారు 30 లక్షల రూపాయల నికర లాభాలు అర్జించి దిగ్విజయంగా ముందుకు దూసుకు వెళ్లడం గర్వకారణమని త్రిఫ్ట్ సొసైటీ సహకారం సభ్యులు సొసైటీని అభివృద్ధి పథంలో నడిపేందుకు సభ్యులు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తూ ఎల్లప్పుడూ సొసైటీకి ఆదరణను అందించాలని ఆయన అన్నారు.ఎన్నో సంవత్సరాల నుండి నైపుణ్యం ఉన్న కార్మికులను పక్కనపెట్టి వేరే రాష్ట్రాల నుండి తీసుకోవడం అన్యాయం ఉపాధి రక్షణ ఉంటే కార్మిక సంఘాల హక్కులతో వచ్చిన డి ఎ కరువు బత్యం సాధించుకోగలం.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సొసైటీ కార్యదర్శి పి.నారాయణరావు డైరెక్టర్లు,G. శ్రీనివాసరావు, N. శశిభూషణ్ రావు,SN.కృష్ణ తో పాటు రిప్రజెంటేటివ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.