
పేదింటి మహిళలు ఆర్థికంగా భలోపేతం కావడమే శిల్పా సహకార్ బ్యాంక్ లక్ష్యం: బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి.
నంద్యాల (AIMA MEDIA): బుధవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నేడు 72వ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 15 సంవత్సరాల క్రితం నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేదింటి మహిళలను ఆర్థికంగా భలోపేతం చేయాలన్న ఉద్ధేశంతో శిల్పా మహిళా సహకార బ్యాంక్ ను స్థాపించారని, నేడు దినదినాభివృద్ధి సాధించి 13వేల మంది మహిళా ఖాతాధారులు, 26కోట్ల రుణాలను పొందడం జరిగిందని తెలిపారు. భవిషత్తులో లక్షమంది ఖాతాదారులతో 200 కోట్ల రూపాయల రుణాలను అందించేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా భలోపేతం అయితే కుటుంబం, సమాజం, రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళా సాధికారతే శిల్పా కుటుంబం లక్ష్యంగా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులువివిధ ప్రయోజనకరమైన అంశాలను తెలియజేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా సహకార సంఘం అధికారులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామాంజనేయులు, గౌరవ ఆహ్వానితులు జిల్లా అధికారులు టి రుక్సానా బేగం శ్రీ జే రాములు, సౌజన్య బి శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నరసింహారెడ్డి , శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, లక్ష్మీనారాయణ మరియు మహిళలు పాల్గొన్నారు.