logo

కామ‌న్వెల్త్ చెస్ ఛాంపియ‌న్ షిప్ -2025లో కాంస్య‌ పతకం సాధించిన ముసునూరి రోహిత్ ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)


క్రౌన్ హ్యూమన్ రైట్స్ విజ‌య‌వాడ‌ నవంబర్ 18;

మ‌లేషియాలోని కౌలాలంపూర్ లో న‌వంబ‌ర్ 8 నుంచి 16 వ‌ర‌కు జ‌రిగిన కామ‌న్వెల్త్ చెస్ ఛాంపియ‌న్ షిప్ -2025లో కాంస్య ప‌త‌కం సాధించిన విజ‌య‌వాడకు చెందిన చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ ముసునూరి రోహిత్ ల‌లిత్ బాబు ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినందించారు. రోహిత్ ల‌లిత్ బాబు ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ శాలువాతో స‌త్క‌రించారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను విజ‌య‌వాడ‌కు చెందిన ముసునూరి రోహిత్ ల‌లిత్ బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. 15కి పైగా దేశాల‌కు పాల్గొన్న కామ‌న్వెల్త్ చెస్ ఛాంపియ‌న్ షిప్ -2025లో 9 రౌండ్ల‌లో 7 పాయింట్ల సాధించి కాంస్య ప‌త‌కం కైవ‌సం చేసుకున్న‌ట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి ముసునూరి రోహిత్ ల‌లిత్ బాబు వివ‌రించారు. రోహిత్ లలిత్ బాబు ప్ర‌తిభ‌, కృషి యువ క్రీడాకారుల‌కు స్పూర్తిగా నిలుస్తుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.

0
0 views