logo

నిండు గర్భిణీ ఉరివేసుకొని ఆత్మహత్య

జర్నలిస్ట్: ఆకుల గణేష్
కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి, భూపాలపల్లి (D) ఘనపురం(M) బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం మౌనిక 7 నెలల గర్భిణి. అయితే ఇటీవల అదనపు కట్నం కోసం భర్త ప్రశాంత్ వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు చావుకు భర్త ప్రశాంత్, అతని కుటుంబసభ్యులే కారణం అని మౌనిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

0
46 views