logo

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శిశు మరణాలు : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

నెల రోజుల వ్యవధిలో 5 మంది అభం శుభం తెలియని గిరిజన శిశువులు మరణించడంపై అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విచారం వ్యక్తం చేశారు. నియోజకవర్గం లోని ముంచంగిపుట్టు మండలం దారేల పంచాయితీ కుమారిపుట్టు గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 5 మంది శిశువులు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కుమారిపుట్టు గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శిశు మరణాలు జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదల ప్రాణాలకు రక్షణ లేదని విమర్శించారు. నెల రోజుల వ్యవధిలో 5 మంది అభం శుభం తెలియని గిరిజన శిశువులు మరణించినా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం చాల బాధాకరమని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళినా సరైన వైద్యం అందించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శిశు మరణాలపై సుదీర్ఘంగా దర్యాప్తు చేసి శిశు మరణాలు జరగకుండా చూడాలని కోరారు. చలి కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన గిరిజన ప్రాంతంలో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ సమయంలో గిరిజనుల ఆరోగ్యపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు.
కుమారిపుట్టు గ్రామాన్ని సందర్శించిన వారిలో పాడేరు మాజీ ఎమ్మెల్యే కోట్టగుల్లి భాగ్యలక్ష్మి, ముంచంగిపుట్టు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పద్మారావు, వైసీపీ అల్లూరి జిల్లా జేసీఎస్ కన్వీనర్ అరభిర జగబంధు, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పాంగి పులిరాజు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు ఉన్నారు.

0
35 views