logo

కట్టుకున్న భర్తనే కడ తేర్చాలని చూసిన భార్య

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ నివాసి అయినా సిరివెళ్ల వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి పాలకేంద్రం నుండి హైవే రోడ్డు మీదగా వస్తుండగా వెంకటేశ్వర్లు భార్య మల్లె పోగు సుజాత, మల్లె పోగు రాజు,రంగాపురం మోహన్ శెట్టి,వెంకటేశ్వర్లు కూతురు, మరో ఇద్దరు వ్యక్తులు సిరివెళ్ల వెంకటేశ్వర్లును వెంబడించారు.చంపాలని కళ్ళల్లో కారం కొట్టి ఆటోలోకి ఎత్తుకొని నోటి నిండా ఊపిరాడకుండా గుడ్డ నొక్కి చంపేయాలని చాబోలు రస్తాకు తీసుకొని పోగా అక్కడ కొందరు వ్యక్తులు
అడ్డగించుకోవడం వలన అయ్యలూరు మెట్ట సమీపంలో దగ్గర ఉన్నటువంటి ఎస్పీ వై రెడ్డి పెట్రోల్ బంకు వద్దకు తీసుకెళ్లారు. సిరివెళ్ల వెంకటేశ్వర్లు కాపాడండి అని కేకలు పెట్టడం వలన రోడ్డు మీద వెళ్లే ఆటో వ్యక్తులు వెంకటేశ్వర్లు ను తీసుకువెళ్లే ఆటోను అడ్డగించుకోవడం వలన అతని ప్రాణానికి ఏ లాంటి ప్రాణపాయం జరగలేదని తెలిపారు. పోలీసులకు విషయం తెలపక అక్కడినుండి ఇద్దరు వ్యక్తులు నంద్యాల తాలూకా స్టేషన్ కు అప్ప చెప్పారు.
వీటి వివరాలను తాలూకా సిఐ ఈశ్వరయ్య పూర్తి వివరాలు తీసుకొని విచారణ చేపట్టారు.

1
90 views