logo

జాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరము మరియు పేదలకు నిత్యావసరాల పంపిణీ...

తేదీ: 18-11-2025:శేరిలింగంపల్లి, చందానగర్ :ఈరోజు మాదాపూర్ అరుణోదయ కాలనీలో గల జాయ్ అనాధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరము మరియు ఆ ప్రాంతంలోని 200 మంది పేదలకు నిత్యావసర వస్తువులు ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంటనూనె, కిలో గోధుమపిండి మొదలగునవి) జాయ్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ గారు పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటు వైద్య శిబిరములో అవసరమైన వారికి ఒక నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం జాయ్ ఫౌండేషన్ లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండే నరేష్ అనే అనాధ క్రితం సంవత్సరము క్యాన్సర్ వ్యాధి మూలంగా చనిపోవడం జరిగింది. అతని ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వైద్య శిబిరము మరియు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ఊ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి కోటేశ్వరరావు విచ్చేసి వైద్య శిబిరాన్ని మరియు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి తదనంతరం మాట్లాడుతూ " *రాజ్ కుమార్ గారు గత 20 సంవత్సరముల నుండి ఉచిత వైద్య శిబిరాల ద్వారా ముఖ్యంగా HIV వ్యాధిగ్రస్తులకు మరియు యితరులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. గత 10 సంవత్సరముల క్రిందట జాయ్ ఫౌండేషన్ స్థాపించి అనాథలకు రాజ్ కుమార్ గారు అందిస్తున్న సేవలు అమోఘం"* అని కొనియాడారు. " *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవరుచుకోవాలి. మానవునికి ఆత్మ సంతృప్తికి మించినది లేదు. యిటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, నిర్వహించడం, ప్రోత్సహించడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది"* అని అన్నారు. " *మన సంపాదనలో ఎంతో కొంత ఈ విధమైన కార్యక్రమాలకు వెచ్చించినపుడే మన సంపాదనకు సార్థకత ఏర్పడుతుంది* " అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సృజనా రాజ్ కుమార్ మరియు ఆశ్రమ వాసులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వసంత్ కుమార్ మరియు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

13
622 views