వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలి : అరకు ఎమ్మెల్యే రేగం
ముంచింగిపుట్టు మండలం, బంగారుమెట్ట టీడబ్ల్యూ ఆశ్రమ(బాలికలు) పాఠశాల, కిలగడ జీటీడబ్ల్యూ ఆశ్రమ(బాలురు) పాఠశాలలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఆయ పాటశాలల రికార్డు లను తనిఖీ చేసి, విద్యార్ధుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయడంలేదని ఎమ్మెల్యే అన్నారు. వసతి గృహాలలో మెనూ అమలుపై అధికారుల పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మెనూ పరిమాణాలు సరైన విధంగా ఉంటే విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని,ఆరోగ్యంగా ఉంటారని, విద్యార్థులకు ఇచ్చే మెనూలో కోతలు విధించడంతో విద్యార్థులకు ఏ రకంగా పౌష్టికాహారం అందుతుందని ప్రశ్నించారు. మెనూ సక్రమంగా అమలు కాకపొతే పౌష్టికాహారం అందక విద్యార్ధులు అనారోగ్యాలకు గురవుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.