logo

ప్రకృతి వ్యవసాయంతో నవధాన్యాల సాగు – రైతులకు ద్విగుణ ఫలితం మెంటాడ


మెంటాడ మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆర్.టి.యల్ (రీజనల్ థిమాటిక్ లీడ్) ప్రకాష్ , అదనపు డీపీఎం స్వామి నాయుడు జె.ఆర్.పి.ఇ మెర్సీ మంగళవారం మెంటాడ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. రాబోయే రబీ వరి సాగుకు ముందు నవధాన్యాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా వివరించారు.

అధికారులు మాట్లాడుతూ—నవధాన్యాల సాగు ద్వారా భూసారం గణనీయంగా పెరుగుతుందని, పంటకు కావలసిన యన్.పి.కె (నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్) సహజ సిద్ధంగా లభిస్తుందని, ఫలితంగా రబీ వరికి బలం చేకూరుతుందని తెలిపారు.

మెంటాడ మండలంలోని తమ్మిరాజుపేట, పిట్టాడ, చింతలవలస, లోతుగెడ్డ, కైలాం గ్రామాల రైతులకు రబీ సీజన్‌లో ఒకే రకమైన పంట కాకుండా డ్రై–సోయింగ్ పద్ధతిలో ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలు, దుంపజాతి పంటలను కూడా సాగు చేయాలని సూచించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాక పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గుతుందని నిపుణులు తెలిపారు.

ఇక ప్రకృతి వ్యవసాయ ప్రయోగాలలో భాగంగా మెంటాడ మండలానికి చెందిన బి.వి.జీ అప్పలనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో యం.టి.యు-1121 వరి విత్తనాన్ని 5×5 పద్ధతిలో నాటారు. ఈ ప్రయోగంలో తడిబరువు ప్రకారం 17.7 × 162 = 2,867.4 కిలోల దిగుబడి రావడం విశేషంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు, యం.టి సన్యాసినాయుడు, అనురాధ, శ్రీరామ్, L3s తదితరులు హాజరయ్యారు.

2
345 views