logo

ఉమ్రా భక్తులపై ఘోర విరుపు 45 మంది అగ్నికి ఆహుతి మదీనా సమీపంలో బస్సు– ట్యాంకర్ ఢీ ముగ్గురు తరాలే చిద్రమైపోయిన కుటుంబం

విషాదంపై జగ్గయ్యపేటఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తీవ్ర దిగ్భ్రాంతి

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నవంబర్18 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు ముసురించింది. హైద‌రాబాద్‌ నుండి ఉమ్రా/హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు మక్కాలో పవిత్ర దర్శనాలు ముగించుకుని మదీనాకు బయలుదేరిన సమయంలో, నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్‌ను వారి బస్సు ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లోనే అగ్నికీలల్లో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 45 మంది యాత్రికులు సజీవదహనమ య్యారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు కలిసి ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన హృదయ విదారకంగా మారింది. ముఖ్యంగా, ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలకు చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను, తెలుగు రాష్ట్రాల ప్రజలను కన్నీర్లో ముంచింది.
“మనసు కలచివేసే విషాదం” — ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
ఈ దుర్ఘటనపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “పవిత్ర యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న అమాయక భక్తులు ఇలా అగ్నికి ఆహుతి కావడం ఆవేదన కలిగిస్తోంది. ఒకే కుటుంబం నుండి మూడు తరాలు ఇలా ఒక్కసారిగా కోల్పోవడం మాటల్లో వర్ణించ లేనిది. మృతుల కుటుంబాలు అనుభవిస్తున్న వేదన తప్పని తీరం కాదు,” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే, “ఈ క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నాను,” అని తెలిపారు.
స్థానిక నేతలు సానుభూతి
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి షేక్ సయీద్ అన్వర్, 1వ వార్డు కౌన్సిలర్ సామినేని మనోహర్, షాది ఖానా చైర్మన్ సయ్యద్ షబ్బు, ఈద్గా కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ ఘఫూర్, వైస్ చైర్మన్ సయ్యద్ అహ్మద్, కమిటీ మెంబర్ షేక్ రహీం, దర్గా కమిటీ చైర్మన్ షేక్ రఫీ, మాజీ చైర్మన్ మహమ్మద్ జమీరుద్దీన్, షేక్ మొహమ్మద్ అస్లాం, ఈటీడీపీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ఈద్గా కమిటీ సెక్రటరీ షేక్ అల్లాబక్షు, షేక్ ఖాసిం, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లెల కొండయ్య, వంగూరి కోటేశ్వర రావు, ఎనికే గోపి, సోమాల వెంకట్, గాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

0
46 views