logo

ఎన్ఎల్ఆర్-3648 ఏంటియు-1426 మినికిట్లు పరిశీలన: ఏఓ పవన్ కుమార్.

బండి ఆత్మకూరు (AIMA MEDIA): బండి ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామంలో రైతుల సాగుచేసిన ఎన్ఎల్ఆర్-3648 ఏంటియు-1426 వరి మీనికిట్ల క్షేత్రాన్ని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ..కాకనూరు గ్రామంలో పెద్ద వెంకటయ్య పొలంలో కొత్త వరి వంగడాలు జాతీయ ఆహార భద్రత పథకం కింద మినికెట్లను సాగు చేశారని,ఏంటియు-1426 వరి రకం పెద్ద ఆకులు, లావు గింజలతో పాము పొడ మరియు అగ్గితెగులు తట్టుకునే రకంగా మరియు సగటు ఎకరాకు 42 బస్తాలు దిగుబడి అంచనా వేసారు, ఎన్ఎల్ఆర్-3648 రకాలతో పోల్చితే ఏంటియు-1426 మేలైన రకంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో తో పాటు వ్యవసాయ విస్తరణ సిబ్బంది యశోద పలువురు రైతులు పాల్గొన్నారు.

0
0 views