
రోడ్డు మీద దాన్యం ప్రయాణికులకు ఇక్కట్లు.
గడివేముల (AIMA MEDIA): నంద్యాల జిల్లా నంద్యాల నుండి నందికొట్కూరు వైపు 60 కిలోమీటర్లు మేర బస్సులో ప్రయాణం సాగిస్తుంటారు. రహదారిలో రైతులు రోడ్డు మీద దాన్యం ఆరబోయడం వలన ప్రయాణికులకు రాకపోకలు ఇబ్బంది కలిగిందని వాపోతున్నారు. నిత్యం రద్దిగా ఉండే ఈ రహదారిలో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భారీ వాహనాలు తిప్పడం వలన ఈ రహదారి పై నానక ఇబ్బందులు గురి అవుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం రద్దిగా ఉండే ఈ రహదారి లో ఒక వైపు, ధాన్యం, ఒకవైపు, రోడ్డు పాచిలా తో కూడిన నేర్రలు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారికి ఎంతో ఉన్నత మైన అధికారులు, ప్రజా ప్రతినిధులు తిరుగుతూ ఉండడం విశేషం.ఈ రహదారివెంట 30 కిలోమీటర్లు మేర భారీ వాహనాలు తిరగడం వలన రోడ్డు క్రుంగిపోతుంద ని గ్రామాల ప్రజలు తెలిపారు. ఆర్టీసీ బస్సు లో జనాలు ప్రయాణం చేస్తూ ఉంటారు.ద్విచక్ర వాహనాలు వందల సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తూంటారు. అలాగే ఈ రహదారి కి మోక్షం ఎప్పుడో అని జనాలు వాపోతున్నారు. ఈ రహదారిని బాగుచేయండి ప్రభో అని మొక్కుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, నాయకులు బేదాభిప్రాయాలు లేకుండా ప్రజలు కోరుకున్నట్లు ఈ రహదరిని బాగుచేయమని కోరుకుంటున్నారు. అలాగే ఈరహదారివెంట ధాన్యం అరబోసి నావారిపై అలాగే రహదారిపై ఎలాంటివి వైన ప్రయాణికులు కు ఇబ్బంది కలగాచెస్తే కటీనా చర్యలు తీసుకోవలని గ్రామాల ప్రజలు వేడుకొంటున్నారు.