logo

మడ్డువలస డ్యాంలో పొడువు రెక్కల చేప

వంగర మండలం మడ్డువలస డ్యాంలో సోమవారం పొడువైన రెక్కలతో రాగండి జాతికి చెందిన చేప చిక్కింది. శ్రీహరిపురం గ్రామంలో మత్స్యకారుడు గుడివాడ చిన్నంరాయుడు వేటకు వెళ్లగా వలలో ఈ చేప పడింది. ఇంత వరకు ఇలాంటి చేపను చూడలేదని ఆయన తెలిపారు. అన్‌ ఈవెన్‌ గ్రోత్‌ వలన ఇలా రెక్కలు పొడువుగా ఉంటాయని ఫిషర్రిష్‌ అధికారి వెంకట్రావు వెల్లడించారు. ఇటీవల కురిసిన వర్షాలకు డ్యాంలోకి వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

7
369 views