logo

*మానవత్వం చాటుకున్న కలెక్టర్*



జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తుఫాన్ ప్రభావిత మండలాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా గజపతినగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపించి, స్వయంగా దిగి, గాయపడిన వ్యక్తుల వద్దకు చేరుకున్నారు. బాధితుల స్థితిని తెలుసుకుని, అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించి తక్షణం ఆసుపత్రికి తరలించారు.
ఎక్కడైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితి ఉంటే మానవతా దృష్టితో స్పందించాలని
ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. గోల్డెన్ హావర్ లో అందించిన సాయం మనిషి ప్రణాలను కాపాడుతుందని ప్రాణం కంటే విలువైనది మరేమీ లేదని అన్నారు.

కలెక్టర్ యొక్క ఈ మానవతా స్పందనను చూసి అక్కడ చేరిన ప్రజలు ప్రశంసించారు. ప్రజలకు చేరువైన అధికారిగా ఆయన ప్రవర్తన మరోసారి వెలుగులోకి వచ్చింది.

4
78 views