logo

రైతులు ఆందోళన చెందనవసరం లేదు




మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అయినా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని రాజాం టౌన్ టీడీపీ కమిటీ ప్రధాన కార్యదర్శి శాసపు రమేష్ కుమార్, విజయనగరం పార్లమెంటరీ బీసీ సెల్ కార్యదర్శి పిల్లా సత్యం నాయుడు తదితరులు భరోసా ఇచ్చారు. మంగళవారం స్థానిక పాలకొండ రోడ్డులోని పొనుగుటి వలస గురువాం ప్రాంతాలలో నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులకు మనో ధైర్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను విశదీకరించారు. పంట నష్టం పై అధికారులతో అంచనాలు వేయించి, రైతులను ఆదుకుంటారని, ఇందుకు రాజాం నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, రాష్ట్రంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు రాత్రి పగలు అన్న తేడా లేకుండా తుఫాన్ తీవ్రతను అంచనా వేస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తుఫాన్ తో అత్యవసర సమస్య వస్తే తక్షణమే ఈ నంబర్స్ 9440121343, 9490892789 కి సంప్రదించాలన్నారు.

14
333 views