పూర్తిగా దెబ్బతిన్న ఇంటి నుంచి తక్షణమే ఖాళీ చేయండి: ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్.
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని చంద్రునిపేటలో నివాసముంటున్న పోలా నారాయణ ఇంటిని మండల రెవెన్యూ అధికారి ధోని ఆల్ఫ్రెడ్ సోమవారం సాయంత్రం సందర్శించి, తనిఖీ చేశారు. పోల నారాయణ నివసిస్తున్న మట్టి పైకప్పు గృహం తీవ్ర ప్రమాదకర స్థితిలో ఉందని ఎమ్మార్వో గుర్తించారు. దీంతో, ఆ ఇంటిని తక్షణమే ఖాళీ చేయాలని, బారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏ సమయం లో అయిన కూలడానికి సిద్ధంగా ఉన్న మట్టి మిద్దె యజమాని పోల నారాయణకు ఎమ్మార్వో సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరగకముందే నివాసిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని, ఇంటిని వెంటనే ఖాళీ చేయించడంతో పాటు, నారాయణను అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వీఆర్వో మరియు వీఆర్ఏలకు ఆదేశాలు జారీ చేశారు.