కలెక్టరేట్‌లో ప్రత్యేక డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో 10 శాఖల సమన్వయంతో ప్రత్యేక డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేసి, తక్షణ సహాయక చర్యలు చేపట్టనున్నారు. ఈ కంట్రోల్ రూమ్ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు 24 గంటలు కార్యకలాపాలు కొనసాగిస్తుంది.