logo

150 మస్టర్ల కండిషన్ కార్మి కులను కుదించేకుట్ర సర్క్యులర్ ను విరమించుకోవాలి. *సర్క్యులర్ రద్దుపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్పందించాలి:GLBKS డిమాండ

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ::కొత్తగూడెం టౌన్::: అక్టోబర్ 26:::( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


*150 మస్టర్ల కండిషన్ కార్మి కులను కుదించేకుట్ర సర్క్యులర్ ను విరమించుకోవాలి.*

*సర్క్యులర్ రద్దుపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్పందించాలి....GLBKS డిమాండ్.*

*సింగరేణి కార్మికులు సం.లో తప్పనిసరిగా 150 మస్టర్లు ఉండాలని లేని యడల వారి పై చర్యలు తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం సర్కులర్ విడుదల చేసింది. ఇది గైర్హాజరవుతున్న కార్మి కులను డ్యూటీలు చేయిం చేందుకు ఉద్దేశించబడిన సర్కులరని యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తున్న ది.ఇది కార్మికులనుకుదించా లనే తమ లక్ష్యాన్ని దొడ్డిదా రిన అమలు చేసే ప్రయత్న మని,ఈ లక్ష్యంతోనే తీవ్ర అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికుల ను మెడికల్ బోర్డు అన్ ఫిట్ చేయాల్సి ఉండగా వారిని ఫిట్ చేసారని వారసుల ఉద్యోగాలు ఎగ్గొటేoదుకు నిన్న ఫిట్ చేసి ఇప్పుడు 150 మస్టర్లు కండీషన్ పెట్టీ ఇంటికి పంపేందుకు తెచ్చిన ఈ సర్కులర్ ను GLBKS.. IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నదని దీనిని విరమించుకో వాలని GLBKS.IFTU జనరల్ సెక్రెటరీ జే.సీతారా మయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికే వంద మస్టర్లు ఉండాలని నిబంధనను సవరించి దానిని 150 మస్ట ర్లుగా చేయడం వెనుక కార్మి కులను తగ్గించడానికి చేస్తు న్న దొడ్డిదారి ప్రయత్నంగా GLBKS భావిస్తున్నదని ఆయన అన్నారు.
సింగరేణి యాజమాన్యం అనారోగ్యంతో బాధపడుతున్న పని చేయలేని కార్మికులు బోర్డుకు దరఖాస్తు చేసుకొని అన్ఫిట్ చేయాలని 55 మంది కార్మికులు దరఖాస్తు చేసుకుంటే వారందరినీ ఫిట్ చేయడం ద్వారా మానసిక,శారీరకoగా ఒత్తిడి చేయడం,వేధింపులకు గురిచేయడం అవుతుందని ఆయన అన్నారు.నిన్న మెడికల్ బోర్డులో ఫిట్ చేయబడిన కార్మికులు నిజంగా తీవ్ర శారీరక అశక్తత వల్ల పనిచేయలేని వారని దీనితో యాజమాన్యం పరోక్షంగా అంగీకరిస్తున్నదని ఆయన తెలిపారు.వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని ఏకైక కారణంగా అన్ఫిట్ చేయకుండా అందరిని ఫిట్ చేయడం జరిగిందనేది ప్రస్తుత యాజమాన్యం వైఖరితో స్పష్టంగా అర్థం అవుతున్నదని అన్నారు.ఇప్పటికే డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ఉద్యోగులకు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన ఉద్యోగాలకు అడ్డం పడుతూ VTC ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

సింగరేణి కార్మికులనుకు దించాలనే దొడ్డి దారి ప్రయత్నంలో భాగంగా యాజమాన్యం విడుదల చేసిన సర్కులర్ ను విరమించుకోవాలని IFTU డిమాండ్ చేసింది.

గుర్తింపు,ప్రాతినిధ్య,సంఘా లు దీనిని ఆపేందుకు సిద్ధం కావాలని ఇందుకు యాజ మాన్యం మొండికేస్తే అన్ని సంఘాలను కలుపుకొని తగిన కార్యాచరణను రూపొందించి సర్కులర్ రద్దుచేసేందుకు సిద్ధo కావాలని GLBKS విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.



35
1466 views