logo

గిరిజన దర్బార్ (రేపు సోమవారం) నిర్వహించే కార్యక్రమానికి సకాలంలో అధికారులు హాజరుకావలెను **ఐటీడీఏ పీవో బి రాహుల్)

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం* 26 అక్టోబర్ 25*ఏఐఎంఏ మీడియా ప్రతినిధి,

తేదీ 27 అక్టోబర్2025 సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
----------------అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది---------------

172
6548 views