డ్రగ్స్ నివారణకై ఇల్లందు సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు
AiMa మీడియా అక్టోబర్ 27 :
డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థుల తో ఇల్లందు పట్టణంలో శనివారం పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా విద్యార్థులు పోలీసులు డ్రగ్స్ సేవించడం విగ్రహించడం చట్టరీత్య నేరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో ఇల్లందు డిఎస్పి చంద్రబాను సిఐ తాటిపాముల సురేష్ ఎస్సై సూర్య , హసీనా విద్యార్థులు తో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు యువత పట్టణంలో గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా యువకులే గంజాయిలకు డ్రగ్స్ మద్యపానాలకు అలవాట్లకు పాల్పడుతున్నారు ఇలాంటి అలవాట్లకు చాలా దూరంగా ఉండాలని డిఎస్పి చంద్ర భాను పిలుపునిచ్చారు.