logo

విజయవాడ ఉత్సవ్ కు విద్యుత్ దీపాల అలంకరణను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాధ్, బుద్దా వెంకన్న #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

విజయవాడ ఉత్సవ్ కు విద్యుత్ దీపాల అలంకరణను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాధ్, బుద్దా వెంకన్న
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
బ్రాహ్మణి వీధిలో బుద్దా వెంకన్న కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో కేసినేని శివనాథ్ మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు విజయవాడ ఉత్సవ్ ను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనే ఉత్సవ్ కార్యక్రమాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
రేపు మేము ఉన్నా లేకున్నా... ఈ కార్యక్రమాలు నిరంతరం జరగాలనేది మా ఆకాంక్ష అని చెప్పారు. ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాల్సిన వైసీపీ నేతలు వివాదంగా మార్చడం సరికాదన్నారు.
వైసీపీ నేతలంటేనే డ్రామాలని అందరికీ తెలుసన్నారు. ఆరోజు బాబాయిని చంపి, చంద్రబాబుగారిపై నెట్టారని గుర్తు చేశారు. కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
వడ్డీ వ్యాపారం, ఇసుక, బూడిద వ్యాపారాలు చేశారు.
ఇవన్నీ కోర్టుల్లో నిర్ధారణ కానుండటంతో.. మళ్లీ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు అరుస్తున్నారనీ అన్నారు.
దొంగల ముఠా మొత్తం ఒక చోట చేరి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలమంది విజయవాడకు వస్తారు. నగర ప్రాచుర్యం, కళలను పరిచయం చేసేందుకే విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నాం అని అన్నారు.
విజయవాడ ప్రజలంతా భాగస్వామ్యం అయ్యి... అమ్మవారి భక్తులకు వినోద కార్యక్రమాలను అందిస్తారన్నారు. విజయవాడ నగరం మొత్తం విద్యుద్దీపాలతో అలంకరించబోతున్నాం.
ప్రజలు కూడా తమ ఇళ్లను, షాపులను విద్యుత్ దీపాలతో అలంకరించుకోవాలని కోరుతున్నాం. దసరా ప్రతిష్టను, రాబోయే విజయవాడ ఉత్సవ్ ద్వారా దేశవిదేశాల్లో చర్చించుకునేలా ఉండాలన్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ పేర్ని నాని కోర్టులను కూడా విమర్శలు చేస్తున్నారని,
కోర్టుల మీద గౌరవం లేకపోతే నువ్వు బొక్కేసిన బియ్యం పై నువ్వే మాట్లాడు అని సూచించారు. బియ్యం దోపిడీ కేసులో మీకు స్టే ఇస్తే సంబరాలు చేసుకున్నారు కదా అని గుర్తు చేశారు. స్టే వెకేట్ అయితే మాత్రం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేశినేని చిన్నీ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా పేర్ని నానీ వెంకన్న అన్నారు. కేశినేని నానీ మీ వెనుక ఉన్నాడని ఇప్పుడు మీరే రుజువు చేశారు.
చంద్రబాబును పొగడ్తలతో ముంచిన కేశినేని నానీ .. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చారు. అంటే నానీ ఘీరగా మాట్లాడిన విధంగా చిన్నీ మాట్లాడటం లేదని మీరు బాధ పడుతున్నారా ..? అని బుద్దా ప్రశ్నించారు. ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు చిన్నీ సారధ్యంలో విజయవాడ ఉత్సవ్ జరుగుతుందన్నారు.
కోర్టులు కూడా మాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయన్నారు. మంచి పనులు చేసే వాళ్లపై బురద జల్లడం వైసీపీ నేతలకు అలవాటే అని పేర్కొన్నారు.
2.50లక్షల ఓట్లతో ఓడిపోయిన కేశినేని నాని పేమెంట్ ఇచ్చి.. నానీతో మాట్లాడిస్తున్నారు అని చెప్పారు. మీరు ఎన్ని వాగినా.. ఆగేది లేదు.. ఉత్సవాలు జరిపి తీరుతాం తెలిపారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తప్పకుండా వారికి మరోసారి బుద్ది చెబుతారన్నారు.
మీరు చేసేవే దొంగ పనులు... సత్య హరిశ్చంద్రుల్లాగా నీతులు మాట్లాడతారా ఎద్దేవా చేశారు.

5
725 views