logo

కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులేషన్ ప్రక్రియ పురుణం ప్రారంభించాలి.



కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ పునః ప్రారంభించాలి

మహిళా ఆవేదన దీక్షలో ఏపీఎన్ జి ఒ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ డిమాండ్.

ఎలక్షన్ కోడ్ కారణంగా చివరి దశలో నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ పునః ప్రారంభించాలని కోరుతూ 36 గంటలపాటు మహిళా కాంట్రాక్టు లెక్చరర్స్ చేపట్టిన ఆవేదన దీక్షా శిబిరాన్ని ఏపీ ఎన్ జి ఒ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యా సాగర్ గురువారం సందర్శించి తమ అసోసియేషన్ తరపున సంపూర్ణ మద్దత్తు తెలిపారు.ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం గత ప్రభుత్వం యాక్ట్ 30 చేసి,114 జీవో ఇచ్చిందన్నారు.ఆ జీవో ని వెంటనే అమలు చేసి మిగిలిపోయిన ప్రభుత్వ డిగ్రీ,జూనియర్,పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ ని వెంటనే రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆవేదన దీక్షలో కూర్చున్న కోలా రత్న కుమారి,కొప్పిశెట్టి లతారాణి,రొంపిచర్ల స్వాతి,మద్దాల దుర్గా మల్లేశ్వరి,ఎస్.లత లకు తమ నైతిక మద్దత్తు తెలియజేశారు.కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జూనియర్ కాలేజీలో మే 2024 మరియు 2025 నెలలకి సంబందించిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.సిపిఎం రాష్ట్ర ప్రధాన వి.శ్రీనివాసరావు,జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాడ శ్రావణ్ కుమార్,ఐద్వా కేంద్ర కమిటీ నాయకురాలు రమాదేవి,అంగన్ వాడి రాష్ట్ర అధ్యక్షురాలు సుబ్బారావమ్మ,,రైతు సంఘం రాష్ట్ర నాయకులు కేశవరావు,ఏపీ ఎన్ జీ వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ,ఏపీటిఎఫ్ రాష్ట్ర నాయకులు బాను మూర్తి,పాండు రంగ వర ప్రసాద్,ఆమాద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణ మోహన్,హరి కృష్ణ,కంభoపాటి కృష్ణ,ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు జగన్,అనిల్,పద్మ,ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర నాయకులుకుమారస్వామి,షణ్ముఖ్,మాధవ్ తదితరులు దీక్షా శిభిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దత్తు తెలియజేశారు.చివరిగా సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ దీక్ష చేసిన మహిళలకు నిమ్మరసం ఇచ్చిదీక్ష విరమింప జేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బి జె గాంధీ,సాయి రాజు,దాసరి రాజు,కామా శేషగిరి,ప్రభాకర్,ఓబయ్య,విజయభేరి,ఖాదర్ వల్లీ,రమేష్బా బు,సుందరరావు,హజరత్,చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

0
278 views