పోలంపల్లి గ్రామంలో ఘనంగా అభినందన సభ
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సెప్టెంబర్18, (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో PACS అధ్యక్షులు మన్నె బాలకృష్ణ నిర్వహించిన అభినందన సభలో KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PACS అధ్యక్షులు మన్నె బాలకృష్ణ, గ్రామ పెద్దలు ఇద్దరు అతిథులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా జగ్గయ్యపేట నుండి భారీ ర్యాలీగా పోలంపల్లి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి వందనములు తెలియజేశారు. అనంతరం సభ వేదిక వద్దకు చేరుకొని గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.