logo

అన్నాభావు సాఠే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

ఉట్నూర్ మండలంలోని తాండ్రా గ్రామంలో సాహిత్య సామ్రాట్, లోక్ షాహిర్ డాక్టర్ అన్నాభావు సాఠే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ కమిటీ అధ్యక్షుడు పి.సుధాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్నాభావు సాఠే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే ఉద్దవ్, సూర్యవంశి దేవరాజ్, మాంగ్ సమాజ్ యూనిటీ ఫోరం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు కాంబ్లే దిగంబర్, గాడేకర్ సంజీవ్ ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు, విష్ణు మోరే లక్సెట్టిపేట్ అధ్యక్షుడు, రాము తోగ్రే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంబ్లే‌ దిగంబర్ గారు మాట్లాడుతూ అన్నాభావు సాఠే గారి జీవిత పోరాటం, సాహిత్య ప్రస్థానం సమాజానికి మార్గదర్శకమని అన్నాభావు సాఠే గారి ఆశయాలను నేటి యువతరం ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు టి.మారుతి, రాంచందర్, సాహెబ్రావు, మనోహర్, విశ్వనాథ్, మాజీ సర్పంచ్ పటేల్ రమేష్ , ప్రహ్లాద్ తో పాటు మహిళలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

59
1452 views