
దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా కమిటీ లు
*వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్,
తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఆగస్టు 31**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా కమిటీ లు
వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో దళిత జర్నలిస్టుల హక్కుల కొరకు ఏర్పాటుచేసిన దళిత జర్నలిస్టుల ముద్దుబిడ్డ దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశ పోగు జాన్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లలో ఆయా జిల్లాలలో కమిటీలు వేయడం జరుగుతుందని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఒక ప్రకటనలొ తెలియజేసినారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న దళిత జర్నలిస్టులు అదరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉన్నదని దళిత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకై ప్రత్యేక చట్టం తేవాలని దళిత జర్నలిస్టులు ఆత్మ గౌరవంగా బ్రతికే విధంగా మన హక్కులను సాధించు కొనుట కొరకు అందరం ఏకం కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రత్న కుమార్ పిలుపునిచ్చినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రతి ఒక్కరి కి అక్రి డేషన్ సౌకర్యం కల్పించాలని దళిత జర్నలిస్టులకు దళిత బంధు ప్లేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షలు మొదటి విడతగా దళిత జర్నలిస్టులకు ఇవ్వాలని ప్రతి జిల్లాకు అక్రి డేషన్ కమిటీలో స్థానం కల్పించాలని పత్రిక నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని ప్రతి దళిత జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని దళిత జర్నలిస్టులు అకాల మరణం చెందితే పది లక్షల ఎక్స్గ్రేషన్ కల్పించాలని ప్రతి దళిత జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని దళిత జర్నలిస్టులకు నిరుద్యోగ భృతి 5000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ దళిత జర్నలిస్టు ఫోరం పదవ మహాసభ సెప్టెంబర్ 19 వ తారీకు రవీంద్ర భారతి హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్క దళిత జర్నలిస్టు లు ఈ మహా సభను విజయవంతం చేయాలని వారు కోరి నారు. జిల్లాల కమిటీలో ఉండుటకు ఆసక్తిగల దళిత జర్నలిస్టులు సంప్రదించండి- 8096770066