logo

*మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం*

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, ఆగస్టు31 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ స్టాప్ సెంటర్ (విజయవాడ) నందు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్ట్, సైకో సోషల్ కౌన్సెలర్ 1 పోస్ట్ భర్తీ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ 16ననోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని. అయితే ఇంటర్వ్యూ లో ఎవరూ అర్హత సాధించనం దున తిరిగి నోటిఫికేషన్ జారి చేసినట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి షేక్ రుక్సాన సుల్తానా బేగం తెలిపారు. కాంట్రాక్టు/ఔట్సోర్సిం గ్ పద్ధతిపై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గలిగిన మహిళా అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల గరిష్ట వయస్సు సడలింపు ఉంటుంద న్నారు. సెప్టెంబర్ 9 వరకు ఆసక్తిగల స్థానిక మహిళా అభ్యర్ధులు ntr.ap.gov.in నుండి దరఖాస్తులు డౌన్లోడు చేసుకొని. పూర్తిచేసి, ధ్రువీకరణ పత్రాల నకళ్ళను గజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి. ఆ దరఖాస్తులను జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డోర్ నెంబర్ 31-4-29/A,గద్దెపూర్ణచంద్రరావు విధి, మారుతీనగర్ సెకండ్ లేన్, విజయవాడ కార్యాలయంలో అభ్యర్ధులు స్వయంగా సమర్పించాలన్నారు.

8
225 views