logo

ఒక్క క్షణం విలువ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది క్షణంలో ప్రాణం నిలిచింది

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఆగస్టు 10***( ఏఐఎంఏ మీడియా)

*ఒక్క క్షణం విలువ....*
*ఈ వీడియో చూస్తే తెలుస్తుంది...*

ఒక్క ఘడియ విలువ అంటే ఏంటో పై వీడియో చూడండి తెలుస్తుంది. రాపూరు నుండి వెంకటగిరి బస్సును క్రాస్ చేసే సందర్బంలో బైక్ లో అమితమైన స్పీడ్ లో వస్తున్న వీరిద్దరూ అదుపు తప్పి కింద పడ్డారు. ఒకరేమో బస్సు కు కొంత దూరంలో పడిపోగా, మరొకరు బస్సు కిందకి వెళ్ళిపోయాడు. రెప్ప పాటులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ ఒక్క సారిగా బ్రేక్ వేసి ఆపేసాడు. ఆ ఒక్క క్షణం అప్రమత్తత లేని పక్షంలో ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోయుండేది. దీన్ని బట్టీ అర్ధమైన విషయం ఎందంటే " రోడ్డు ప్రయాణంలో కొంత బాధ్యత తో ప్రయాణిద్దాం, మనల్ని నమ్ముకున్న కుటుంబం మన రాక కోసం వేచి చూస్తుంటది".

*కొస మెరుపు :*

ఇందులో కొస మెరుపు ఏంటంటే బండి నడిపే వ్యక్తికి బస్సు కింద పడిన వ్యక్తికి సంబంధం లేదు. బస్సు వెళ్ళిపోతుంది క్రాస్ చేసి ఎక్కించు అని అడిగితే మానవతా దృక్పథంతో ఎక్కించుకొని బస్సు క్రాస్ చేసి అతనిని బస్సు ఎక్కించే ప్రయత్నం ప్రమాదానికి కారణం అయ్యింది

477
15221 views