logo

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాఖీలు కట్టిన పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు. #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాఖీలు కట్టిన
పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత, బ్రహ్మకుమారీలు సీఎంకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలాఉండగా...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉదయం పాడేరు పర్యటనలో ఓ ఆదివాసీ మహిళ రాఖీ కట్టారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వంజంగి గ్రామానికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటికి సీఎం వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన చంద్రన్నకు రాఖీ కడతానని సీఎం చేతికి ఈశ్వరయ్య భార్య కొండమ్మ రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కొండమ్మకు సీఎం రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

1
1023 views