logo

ప్రజలకు పట్టణం లో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలి

ప్రజలకు పట్టణం లో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలి
అచ్చంపేట, జూలై03,: నాగర్ కర్నూల్ జిల్లాఅచ్చంపేటపట్టణంలోఉన్నసమస్యలనువెంటనేపరిష్కరించాలని
బిజెపి టౌన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకుఏర్పడుతున్న సమస్యలను వెంటనేపరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం నిరసనను వ్యక్తం చేశారు.ఈసందర్భంగా బీజేపీ పట్టణఅధ్యక్షుడుశ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూపట్టణంలో స్మశాన వాటిక నిర్మించే మూడుసంవత్సరాలు దాటినప్పటి కి రాత్రి వేళలో దహన సంస్కారాలు చేసే వారికి వెలుతురు లేకపోవడంతో పాటు నీటి వసతి కల్పించకపోవడంతో పట్టణ ప్రజలు వెలుతురు లేక సెల్ ఫోన్,యొక్కలైట్లసమక్షంలోకార్యక్రమాలుచేసుకునేదుస్థితి ఏర్పడిందనిఆయన అన్నారు.అంతేకాకుండాగతపాలకులుప్రస్తుతపాలకులు పట్టణ ప్రజలకు ఆహ్లాదం కొరకు ఏర్పాటు చేసిన మినీట్యాంకుబండును శుద్ధిచేసివెంటనే వాడుకలోకితీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి మురుగు కాలువ మరమ్మతులను, ఉప్పునుంతల రోడ్డులో, బస్టాండ్ ఎదురుగా నత్త నడకననిర్మిస్తున్నటువంటి వంతెన పనులనుత్వరితగడుతున్న పూర్తి చేయడంతోపాటు,పట్టణంలో ఉన్న 20 వార్డులలో క్రమం తప్పకుండా మరమ్మతు లకు గురైనచెత్త సేకరణ ఆటోలని వెంటనే రిపేరు చేసి ప్రతి రోజు చెత్త సేకరణ చేసి మహిళలలు, ప్రజల గృహాలలో చెత్త వేయడానికి ఇబ్బంది కలుగ కుండా చెత్తను సేకరించే ఆటో లను పెంచాలని వారు మునిసిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.

1
0 views