logo

తేజ్ భరత్ కి వినతినిస్తున్న ధనలక్ష్మీ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

తేజ్ భరత్ కి వినతినిస్తున్న ధనలక్ష్మీ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మెప్మా ఆర్ పిలకి ఆదాయం పెంపుదల కోసం మీ సేవ వర్మ్స్ చేయటానికి అవకాశం కల్పించాలని కోరుతూ తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఎండీ ఎన్ తేజ్ భరత్ ని ఎపి మెప్మా ఆర్ పి(పట్టణ రిసోర్స్ పర్సన్స్) ఉద్యోగుల సంఘం (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్ పిలకు గౌరవ వేతనం పెంచి ఆరేళ్లు అయిందని, ధరలు ఈ కాలంలో నాలుగు రెట్లు పెరిగాయని, ఆర్.పి.ల వేతనాలు పెరగలేదని, వేతనాలు పెంచాలని, అనేకసార్లు అధికారులకు విన్నవించామని, ఆదాయం పెంపుకు అవకాశం కల్పిస్తామని తమరు హామీ ఇచ్చి ఉన్నారని ఈ వినతి పత్రంలో వివరించారు. ఏపీ మెప్మా ఆర్.పి ఉద్యోగుల సంఘం (సిఐటియు) మార్చి 24వ తేదీన తమరితో చర్చలు జరిపిన తరువాత మా యూనియన్ గా మేము ఇతర ఏ ఆందోళనలు చేపట్టలేదని,
ప్రభుత్వం వేతనాలు పెంచకుండా, ఆదాయాలు పెరిగే మార్గం చూపించకుండా ఉండటం సరైనది కాదని, కావున మీసేవకు సంబంధించిన వర్క్స్ ఆర్ పి లు చేయడానికి అవకాశం కల్పించాలని తద్వారా వచ్చే ఆదాయం ద్వారా వారి కుటుంబాలకు సహాయ పడాలని విజ్ఞప్తి చేస్తున్నామని భరత్ కు విజ్ఞప్తి చేశారు. ఎండి భరత్ సానుకూలంగా స్పందించారు.

1
470 views