*నాగర్ కర్నూల్ జిల్లా....*
రాత్రి ఫ్రెండ్స్ తో సిట్టింగ్త ర్వాత ఆత్మహత్య.. ఇంతకి ఏం జరిగింది.
*నాగర్ కర్నూల్ జిల్లా.
లాడ్జిలో ఓ యువకుడు
ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన ఉన్న ఓ లాడ్జిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ఉపేందర్ (26) జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో సోమవారం రూమ్ తీసుకుని ఫ్రెండ్స్ తో కలిసి దావత్ సిట్టింగ్ వేసినట్లు సమాచారం. అయితే మంగళవారం ఉదయం లాడ్జి నిర్వాహకులు రూములో చూడగా అప్పటికే రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృత దేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.