ఉపాధి వేతన దారుల సరాసరి దినసరి రేటును గణనీయంగా పెంచండి: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.
నంద్యాల రిపోర్టర్ మోహన్ (AIMA MEDIA):
కలెక్టర్ ఛాంబర్ నుండి హామీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన దారులకు ప్రతి రోజు పనిదినాలు తప్పనిసరిగా కల్పించి ఉపాధి వేతన దారుల సరాసరి దినసరి రేటును గణనీయంగా పెంచాలని సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా సోక్ పిట్స్, పశువుల షేడ్స్, పశువుల నీటి తొట్ల నిర్మాణ ప్రగతి ఆశించిన రీతిలో లేదని కేటాయించిన లక్ష్యం పూర్తి చేసేలా శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తపల్లి, వెలుగోడు, పాములపాడు మండలాల్లో ఉపాధి వేతన దారుల సరాసరి దినసరి రేటు 250 రూపాయలు రావడం లేదని యావరేజ్ రేటు గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.*